నిర్మాణ రంగం కుదేలైంది
ఈ ఏడాది ఆరంభం నుంచి పూర్తిగా నిర్మాణ రంగం పడకేసింది. భూములు ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడం కష్టమైపోయింది. బిల్డర్లు, ఇంజినీర్లు సైతం స్థలాలు కొనలేక భవనాలు నిర్మించలేక నిర్మాణాలు ఆపేశారు. దీంతో నా వద్ద పనిచేసే కూలీలు, తాపీమేసీ్త్రలందరికి పని కల్పించలేపోతున్నాం.
– ఎన్.కామేశ్వరరావు, పెద్దమేసీ్త్ర, పాతబస్టాండ్.
పనులు లేక తీవ్ర ఇబ్బందులు
గత 20 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేస్తున్నాం. ఎప్పుడూ ఇంత దారుణంగా లేదు. పనులు లేక నా దగ్గర పనిచేసే 20 మందికి పని కల్పించలేకపోతున్నాం. తాపీ మేసీ్త్రలకు, ఇంజినీర్లను అడిగితే రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు లేవు, నిర్మాణాలు అంతగా లేవు దీంతో పెయింటింగ్ పనులు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ఇలానే పరిస్థితి ఉంటే ఇంకో వృత్తిని ఎంచుకోక తప్పదు.
– పి.వెంకటరమణ,
పెయింటింగ్ మేసీ్త్ర, హాస్పటల్ రోడ్
కొనుగోలు శక్తి తగ్గింది
ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో క్రయవిక్రయాలు తగ్గాయి. పూర్తిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. నగదు రొటేషన్ లేకపోవడంతో ఏ రంగంలోనూ వ్యాపారాలు సరిగా జరగడం లేదు. దీంతో భూముల కొనుగోలు కూడా తగ్గింది. నిర్మాణ రంగంపై ఆధారపడిన మిగతా రంగాలు కుదేలవుతున్నాయి. పెట్టుబడులు పెట్టేసి ఇబ్బందులు పడుతున్నాం. – దుంపల లక్ష్మణరావు, రియల్ ఎస్టేట్ చిరు వ్యాపారి, శ్రీకాకుళం


