మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) :
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమైనదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానంతో విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించామని, ఇప్పు డు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయ డం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయ కులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై.వేణు, మహేష్, కిషోర్, రామోజీ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


