అభ్యుదయ గీతిక
● డ్రగ్స్‌పై పోరుకు మద్దతు పలకాలి
● గంజాయిని తరిమి కొడదాం
● ‘అభ్యుదయం’లో పోలీసు అధికారుల పిలుపు
నేను ఇదే జిల్లాలో పుట్టాను. బలగలో చదువుకున్నారు. ఇక్కడి యువత గంజాయికి బానిసలు కారు. అలాంటి అలవాట్లను తిప్పితిప్పి కొడతారు.
– షకలక శంకర్, సినీ నటుడు
నా బిడ్డ పాలిటెక్నిక్ కాలేజీలో చేరిన మొదటి ఏడాదిలోనే డ్రగ్స్‌కు బానిసైపోయాడు. మా ఊరిలోనూ చాలా మంది ఇలాగే గంజాయికి బానిసలైపోయారు. చివరకు నా బిడ్డపై నేనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాడిప్పుడు జైలులో ఉన్నాడు. – లావేరు మండలం
బెజ్జిపురానికి చెందిన ఓ తల్లి ఆవేదన
ఎంతో మంది తల్లిదండ్రులు నా వద్దకు వస్తున్నారు. తమ బిడ్డలు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, వారిని డీ అడిక్షన్ సెంటర్లకు పంపించాలని కోరుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే కాళ్లావేళ్లా పడి కెరీర్లు నాశనమైపోతాయి సర్. వారిని ఏదోలా దారినపెట్టండంటూ వేడుకుంటున్నారు. – కేవీ మహేశ్వర రెడ్డి, ఎస్పీ
ఓ తల్లి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. గంజాయికి బానిసైపోయిన తన బిడ్డను పోలీసులకు చెప్పి చంపించేయండి అని చెప్పింది. మత్తులో రోజూ జోగుతుంటాడని, వాడి టార్చర్ భరించలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంది. – ఆమదాలవలస ఎమ్మెల్యే
కూన రవికుమార్ చెప్పిన ఉదాహరణ
శ్రీకాకుళం క్రైమ్ :
మత్తులో చిత్తవుతున్న చీకటి బతుకుల కథలు అభ్యుదయం వేదికగా వెలుగు చూశాయి. సరదాగా మొదలై జీవితాలను తలకిందులు చేసే వ్యసనం గురించి ఈ వేదిక అర్థమయ్యేలా వివరించింది. మత్తు వదలని బతుకు చెత్తకుప్పలా మారిపోతుందని హెచ్చరించింది. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విశాఖ రేంజి పరిధి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర మంగళవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ముఖ్య అతిథి గా రేంజి డీఐజీ గోపినాధ్ జెట్టి విచ్చేయగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, పలు విద్యాసంస్థల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు రామలక్ష్మణ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు మాట్లాడారు. అయితే ఎండ వేడిమి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మంచి సమాజం నిర్మించాలంటే సమాజంలో ఉన్న వ్యక్తులంతా మంచివారై ఉండాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత, తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థల మద్దతు ఎంతో అవసరమని అన్నారు. రేంజి పరిధిలో సంకల్పం పేరిట 21,206 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, 16,321 గ్రామ/పట్టణాల్లో, 6459 విద్యాసంస్థల్లో జరిగాయని, విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్‌బాక్స్‌లు చేసి 4,094 ఈగల్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో పోలీసులు ప్రజల్లో చైతన్యం కలిగేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాలల్లో సైకాలజిస్టుల ద్వారా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయిపై సమాచారాన్ని 1972 కు డయల్ చేసి చెప్పాలని, 112కు కూడా చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేసి అందరితో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతినాయుడు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, లక్ష్మణరావు, శేషాద్రినాయుడు, ఆర్డీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
అభ్యుదయ గీతిక
అభ్యుదయ గీతిక
అభ్యుదయ గీతిక


