● బుడితిలో గృహోపకరణాల తయారీ
ఫ్లవర్ వాజ్‌లు
శ్రీముఖలింగం గోపురం, గడియారం, అద్దం
మండలంలోని బుడితి గ్రామంలో నూతన గృహోపకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ లేపాక్షి ఆధ్వర్యంలో రెండు నెలలు శిక్షణ కార్యక్రమం నిర్వహించి నూతన గృహోపకరణాలపై శిక్షణ ఇచ్చా రు. ఇటీవల కలెక్టర్ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి నూతన గృహోపకరణాలు తయా రు చేసి తనకు చూపించాలని సూచించారు. దీంతో కింతాడ జనార్ధనరావు(బుజ్జి) ఇత్తడిలో గడియారం, శ్రీముఖలింగం దేవస్థానంలోని గోపురాలు, అద్దం తయారు చేశారు. అలాగే మరో కార్మికుడు ఫ్లవర్ వాజ్‌లు తయారు చేశారు. వీటిని సోమవారం కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వారు తెలిపారు. –సారవకోట
● బుడితిలో గృహోపకరణాల తయారీ


