బీచ్‌కు సందర్శకుల తాకిడి
గార : మొగదాలపాడు, కె.మత్స్యలేశం, శ్రీకూర్మం– మత్స్యలేశం బీచ్‌లకు అధిక సంఖ్యలో సందర్శకులు పోటెత్తారు. మార్గశిర ఆదివారం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సమీప జీడితోటల్లో వంటలు చేసుకుని, సాయంత్రం వేళ సముద్రంలో స్నానాలు చేస్తూ సందడిగా గడిపారు. శాలిహుండం, బౌద్ధారామాలనూ పలువురు పర్యాటకులు సందర్శించారు. కళింగపట్నం వద్ద బీచ్‌కు అనుమతులు లేకపోవడంతో మైరెన్ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది సందర్శకులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ సీహెచ్.చిరంజీవి సిబ్బందితో గస్తీ నిర్వహించారు.


