కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రయాణికులతో కిటకిటలాడింది. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలిరావడంతో రద్దీమయంగా కనిపించింది. తిరుగు ప్రయాణం కోసం కాంప్లెక్స్‌కు వచ్చిన వారంతా బస్సుల కోసం వేచి ఉండక తప్పలేదు. సకాలంలో బస్సుల రాకపోకలు జరగకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నారు. ఉచిత ప్రయాణం ఎవరు ఇవ్వమన్నారని, ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడపకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు మహిళా ప్రయాణికులు కూటమి ప్రభుత్వానికి తిట్టుకోవడం గమనార్హం. బస్సులు వచ్చిన వెంటనే ప్రయాణికులు ఒకరినొకరు నెట్టుకుంటూ సీట్ల కోసం ఎగబడ్డారు.


