చోరీ కేసులో ముద్దాయికి జైలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ద్విచక్ర వాహనం చోరీ చేసిన కేసులో పట్టుబడిన ముద్దాయి గొల్లకంచిలి గ్రామానికి చెందిన డొక్కరి రవికి 8 నెలల జైలు శిక్షతోపాటు, రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చిన ట్లు స్థానిక ఎస్‌ఐ పి.పారినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట ఏజేఎంఎఫ్‌సీ జడ్జి కేసును విచారించిన తర్వాత ఈ మేర కు తీర్పు వెలువరిచినట్లు తెలిపారు. ఈ కేసు వాదనలో ఏపీపీగా పి.నరేష్, దర్యాప్తు అధికా రిగా తాను వ్యవహించినట్లు పేర్కొన్నారు.
సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన కొమర రాజయ్య (63) అనే మత్య్సకారుడు శనివారం సముద్రంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే రాజయ్య చేపల వేట కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. సముద్రపు ఒడ్డున ఒక కర్రను పాతి.. దానికి ఒకవైపు వలను కట్టాడు. మిగిలిన వలను కట్టడానికి సముద్రపు లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. సముద్రపు లోపల వల కడుతున్న సమయంలో పెద్దపెద్ద కెరటాలు రావడంతో ఆ వలలో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయాడు. ఇది చూసిన మత్య్సకారులు రాజయ్యను కాపాడే లోపే మృతి చెందడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నౌపడ ఎస్‌ఐ జి.నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
టెక్కలి: టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలిలో సుమారు రూ.1.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. అలాగే బాలికల క్రీడా మైదానం, బాలికల పాఠశాలలో వంటశాల, టాయిలెట్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టాలి
టెక్కలిలో కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని టెక్కలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రి అచ్చెన్నాయుడుని కోరారు. మంత్రిని కలిసినవారిలో అధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, ఏజీపీ డి.వి.వివేకానంద, న్యాయవాదులు పి.బాబురావు, పి.సాయిరాజు, చంద్రశేఖర్ పట్నాయక్, వైకుంఠరావు, పి.ఆనంద్, కె.బాబురావు తదితరులు ఉన్నారు.
చోరీ కేసులో ముద్దాయికి జైలు


