ధాన్యం బస్తాలు దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట గ్రామం నుంచి మేఘవరం వైపు వెళ్లే మార్గంలో పొలంలో ఉంచిన చింతాడ బుడ్డు అనే రైతుకు సంబంధించిన ధాన్యం బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోని ధాన్యం బస్తాల్లో ఎక్కించి సుమారు 15 బస్తాల ధాన్యం పొలంలో ఉంచగా.. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమీపంలో ఉన్న గడ్డిని కాల్చడంతో ధాన్యం బస్తాలకు సైతం మంట అంటుకుంది. ఇది గుర్తించి స్థానికులు హుటాహూటిన మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నాలుగు ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
సంతబొమ్మాళి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నౌపడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పరపటి హరిణి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం భాను ప్రకాష్ తెలిపారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్– 20 బాలబాలికల కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం బాలికల జట్టు ద్వితీయ స్థానాన్ని, బాలుర జట్టు తృతీయ స్థానం కై వనం చేసుకున్నారు. బాలికల జట్టు విజయం సాధించడంలో నౌపడ విద్యార్థినులు కీలక పాత్రపోషించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పరపటి హరినిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఎంపికపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


