స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
సంతబొమ్మాళి : గెద్దలపాడు గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు చింతల సంతోష్ (26) స్వగ్రామానికి వస్తూ రైలులో గుండెపోటుకు గురై గురువారం మృతి చెందాడు. లక్కివలస ఎంపీటీసీ సభ్యుడు చింతల రాజులు కుమారుడైన సంతోష్ హిమాచల్‌ప్రదేశ్‌లో జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి స్వగ్రామం గెద్దలపాడు వచ్చేందుకు బుధవారం రైలులో బయలు దేరారు. మార్గమధ్యలో గురువారం ఉదయం నాగపూర్ సమీపంలో వచ్చే సరికి రైల్లో గుండెపోటు రావడంతో సీటులోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాజులు, ఆదిలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుతుందని స్థానికులు తెలిపారు.
చింతల సంతోష్ (ఫైల్)


