
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్/కొత్తూరు/హిరమండలం: జిల్లాలోని కొత్తూరు, హిరమండలం మండలాల్లో ఎరువుల దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. కొత్తూరులోని మన గ్రోమోర్ సెంటర్‌లో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో 16.95 టన్నుల కాంప్లెక్సు ఎరువుల అమ్మకాల నిలుపుదల చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ బి.ప్రసాదరావు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్, ఏఓలు సంధ్య, స్వర్ణలత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎర్రన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు
అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న పలువురు రికార్డు అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మురపాక జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ డి.రమాదేవిని వంగర మండలం ఎంఎస్‌ఆర్ పురం జెడ్పీ స్కూల్ జూనియర్ అసిస్టెంట్‌గా, లింగాలవలస రికార్డు అసిస్టెంట్ కె.హేమలతను అమలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు, గోవిందపురం రికార్డు అసిస్టెంట్ పి.జయలక్ష్మిని వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు జెడ్పీ స్కూల్‌కు, బోరుభద్ర జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ ఎ.గోపాలరెడ్డిని సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయానికి, ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట జెడ్పీ స్కూల్ రికార్డు అసిస్టెంట్ కె.పద్మలతను పాతపట్నం పీఆర్‌ఐ సబ్ డివిజన్ జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు గ్రోమోర్ సెంటర్‌లో తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు