
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: గోపాలపురం గ్రామానికి చెందిన రైతు యవ్వారి వైకుంఠరావు (50) గురువారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు గురువారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో మృతి చెందారు. కాసేపటికి స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.