
బురద రోడ్డుపై నడవలేకపోతున్నాం
కొత్తూరు: కుంటిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సిరుసువాడ గ్రామ విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి కుంటిభద్రకు వెళ్లేందుకు రహదారి బురదగా మారడంతో నడవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు నిలిచిపోవడంతో సైకిల్ వెళ్తూ జారిపడుతున్నామని వాపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరాచరు. కాగా, కుంటిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట రుచికరంగా వండటం లేదంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.