
అచ్చెన్న ఏలుబడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రైతులకు మళ్లీ చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. 1999–2004, 2014–2019 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విత్తనాల దగ్గరి నుంచి ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు తీవ్రంగా అవస్థలు పడేవారు. వైఎస్ జగన్ వచ్చాక రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వలంటీర్ల సాయంతో అన్ని సేవలను సులువుగా అందేలా చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో రైతులు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు టీడీపీ నాయకుల దయాదాక్షిణ్యాల మీదే అందేవి. సరిగ్గా అవే పరిస్థితులు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన విత్తనాలు, ఎరువులు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. ఒక్క విత్తనాలు, ఎరువులే కాదు. ధాన్యం కొనుగోళ్లు కూడా గతేడాది అదేరకంగా జరిగాయి. రికార్డుల్లో గరిష్ట స్థాయిలో కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపించారు. మిల్లులకు ట్యాగ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ రైతులు పండించిన ధాన్యం ఎక్కడికక్కడే ఉన్నాయి. మడుల్లోను, పొలాల్లోను ధాన్యం దిబ్బలు కనిపించాయి. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో దళారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో..
2019–24లో రైతులకు స్వర్ణయుగమే అని చెప్పాలి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతీది రైతు ఇంటి వద్దకే వచ్చేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు ఎంత సాగు చేస్తున్నారో? వారికెంత ఎరువులు అవసరమో? ఈ క్రాప్ ద్వారా ముందే గుర్తించేవారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వివరాలు తీసుకునేవారు. ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు నేరుగా ఇంటి కే పంపిణీ చేసేవారు. ఎరువుల కోసం ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండేది కాదు.
ఇప్పుడంతా రాజకీయమే..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా అందించే ఎరువులపై నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద దించాల్సిన ఎరువులను తమ ఇళ్ల వద్ద, తమకు చెందిన ప్రైవేటు గోడౌన్ల వద్ద దించుకుంటున్నారు. కొన్ని చోట్ల తమ కనుసన్నల్లో నడిచే పీఎసీఎస్‌ల వద్ద దించుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో దించిన ఎరువులను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. కావాల్సి న వారికి మాత్రమే ఇస్తున్నారు. దీంతో సాధారణ రైతులకు ఎరువులు అందడం లేదు. ప్రభుత్వం ఎంతకీ ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక ధరకు కొనుగోలుకు సైతం క్యూలో ఎండావానల్లో నిరీక్షిస్తున్నారు.
దారుణ పరిస్థితి
వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా, నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మొన్నటి వరకు విత్తనాలు దొరక్క అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ప్రైవేటు దుకాణాల వద్ద కూడా రైతులు ఎరువుల కోసం వానలో తడుస్తూ క్యూలో ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధాన్యం కొనుగోళ్లు మాదిరి
ప్రస్తుతం..
తాజాగా సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో యూరియా కోసం వర్షంలో బారులు తీరిన రైతుల దృశ్యమిది. అలాగని, ఇదేమీ రైతు భరో సా కేంద్రాల వద్దో, పీఎసీఎస్‌ల వద్దో కాదు. ప్రైవేటు ఎరువుల షాపుల వద్ద రైతుల అవస్థల చిత్రమిది.

అచ్చెన్న ఏలుబడి