
కష్టాల సాగుబడి
గత ప్రభుత్వంలో రైతులకు బాగుండేది
గత ప్రభుత్వంలో మా ఊరిలోకి యూరియాను తెచ్చి ఇచ్చేవారు. ఇంకా ఏమైనా మాకు అవసరమైతే టౌన్‌కి వచ్చి సులభంగా యూరియా తీసుకువెళ్లేవాళ్లం. ఇప్పుడు యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.
డి.సూర్యం, రైతు, టెక్కలి మండలం
గతంలో మా ఊరికే యూరియా వచ్చేది..
వైఎస్సార్‌సీపీ పాలనలో మా ఊరిలోకి యూరియా వచ్చేది. ఇప్పుడు నందిగాం మండలం నుంచి టెక్కలి వచ్చి యూరి యా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంత కంటే కష్టాలు రైతులకు ఇంకేం ఉంటాయి.
– కె.లక్ష్మి, రైతు, కామధేనువు, నందిగాం మండలం
యూరియా లేదంటున్నారు
యూరియా కోసం రైతులను ఉసూరుమనిపించడం మంచిది కాదు. తెల్లారి నుంచి కాపలా కాస్తే చివరకు యూరియా లేదని చెబుతున్నారు.
– కె.సరస్వతి, రైతు, నందిగాం మండలం
వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలో రైతులను వదలని సాగు కష్టాలు
ఎరువుల కోసం అన్నదాతల పాట్లు
ప్రైవేటు దుకాణాల వద్ద తప్పని క్యూలు
1999–2004, 2014–19 పరిస్థితులు
పునరావృతం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల ఇంటి వద్దకే విత్తనాలు,
ఎరువులు

కష్టాల సాగుబడి

కష్టాల సాగుబడి