
మట్టిలో దేవుడు
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
కరకట్ట.. కనికట్టువంశధార నదీ తీర గ్రామాల ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి. కరకట్టల కోసం ఎదురుచూస్తున్నాయి. –8లో
మట్టి మహిమాన్వితమవుతోంది. మండపాలకు చేరేందుకు మూషిక వాహనుడి ప్రతిమ ఉవ్విళ్లూరుతోంది. శత కోటి రూపాల్లో, అనంతకోటి అలంకరణలతో దర్శనమిచ్చేందుకు లంబోదరుడి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ప్రకృతిలో ప్రకృతిలా కలిసిపోయేలా, గంగమ్మ ఒడికి చేరి గణనాథుడు సేదతీరేలా పర్యావరణ హితంగా ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి.
నరసన్నపేట: శివ బృంద సభ్యులు మట్టి మేలు తలపెడుతున్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన ఈ బృందం నరసన్నపేటలో మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తోంది. స్థానిక పైడితల్లి ఆలయం పక్క న ప్రత్యేక శిబిరంలో మట్టితో వినాయక ప్రతిమలు సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారు చేయమని ప్రోత్సహిస్తున్నా శివ బృందం మాత్రం మట్టి విగ్రహాలనే తయారు చేసి పర్యావరణాన్ని కాపాడుతోంది. ఒండ్రుమట్టి, గడ్డి, చొప్ప గడ్డితో విగ్రహాలను తయారు చేస్తున్నామని అంటు న్నారు. స్థానికంగా సేకరించిన మట్టికి గంగా నది నుంచి తెచ్చిన మట్టిని మిక్స్ చేసి విగ్రహాలు త యారు చేస్తున్నారు. రంగులు కూడా పర్యావరణ
హితంగా వినియోగిస్తున్నారు. వాటర్ కలర్స్ వాడుతున్నామని వీటి వల్ల పర్యావరణానికి పూర్తి రక్షణ ఉంటుందని, ఎలాంటి కాలుష్యం వెదజల్లదని తయారీదారు శివ బృంద సభ్యులు చెబుతున్నారు.
సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నరసన్నపేట కేంద్రంగా
మట్టి గణపతుల తయారీ
గంగా నది నుంచి ప్రత్యేకంగా మట్టి సేకరణ
చవితి పూర్తి కాగానే దుర్గా, సరస్వతి, గౌరీ దేవి విగ్రహాల తయారీ