
జిల్లాస్థాయి క్విజ్ పోటీలకు ఆహ్వానం
ఇచ్ఛాపురం రూరల్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సవరదేవిపేట(పేటూరు)లో జిల్లాస్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ పోటీలను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ ఎంట్రీలను ఈనెల 28 నాటికి పంపించాలని, పూర్తి వివరాలకు 8501803445, 8688840057 నంబర్లను సంప్రదించాలని కోరారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఉన్నందు న ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ ప్రభావం ఉంటుందని, దీనివల్ల తేలికపాటి, ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
జీపీఎస్ పరికరాల
పంపిణీలో చేతివాటం
సంతబొమ్మాళి: భావనపాడులో మత్స్యకారులకు అందజేసిన జీపీఎస్ పరికరాల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 21వ తేదీన భావనపాడులో ముందుగా నమోదు చేసుకున్న బోట్లు ఉన్న 88 మంది మత్స్యకారులకు జీపీఎస్ పరికరాలను అధికార పార్టీ నా యకుల సమక్షంలో మత్స్యశాఖ అధికారులు అందజేశారు. ఒక్కో జీపీఎస్ పరికరానికి రూ. 400 చొప్పున రూ. 35,200 కలెక్షన్ చేశారు. డబ్బులు ఇవ్వలేదని కొందరు మత్స్యకారులకు జీపీఎస్ పరికరాలు ఇవ్వడానికి అధికార పార్టీ నాయకులు నిరాకరించారు. దీంతో గత్యంత రం లేక డబ్బులను చెల్లించి పరికరాలను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఉచితంగా పరికరాలను ఇస్తుంటే ఇక్కడ డబ్బులు తీసుకోవడంపై కొందరు నిలదీశారు. దీనిపై టెక్కలి ఎఫ్‌డీఓ ధర్మారాజు పాత్రోను అడుగగా ప్రభుత్వం ఉచితంగానే జీపీఎస్ ప రికరాలను అందజేసిందని, అయితే ట్రాన్స్‌పోర్ట్ లోడింగ్, అన్‌లోడింగ్, భోజనాలకు బోటుకు రూ.200 చొప్పున వసూలు చేసినట్లు తెలిసిందని అన్నారు.
రెండోరోజూ కొనసాగిన
విజిలెన్స్ దాడులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వరుసగా రెండో రోజు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడు లు కొనసాగాయి. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలు జిల్లాలో ఎనిమిది చోట్ల సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. మన జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో 15 చోట్ల జరిగాయి. విజయనగరం పట్టణంలో శ్రీమాతా వెంకటేశ్వరరావు అండ్ సన్స్ రికార్డులు సక్రమంగా లేనందున రూ. 2.47 లక్షల విలువైన 4.35 టన్నుల కాంప్లెక్సు ఎరువుల అమ్మకం నిలుపుదలకు సిఫా ర్సు చేశారు.
ఉత్సాహంగా జానపద సంబరాలు
ఇచ్ఛాపురం: పట్టణంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో జానపద సంబరాలను శ్రీమహతి సాంస్కృతిక కళాసేవాసంస్థ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రపంచ జాన పద దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జానపద సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని గాత్ర కళాకారులు, సంగీత వాయిద్య కళాకారులు, కూచిపూడి, భరతనాట్యం, జానపద కళాకారులు, కోలాటం కళాకారులు పాల్గొన్నారు. ఒడిశా కళాకారుల బృందాలు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జానపద కళలకు ఎనలేని సేవ చేసి జానపద గురువుగా పేరొందిన దుర్గాశి సారధిరెడ్డిని ఘనంగా సత్కరించారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సో మవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు.