
● ప్రతిమ.. పర్యావరణ హితమే
శ్రీకాకుళం కల్చరల్:
మట్టి గణపతిని పూజించాలని, తద్వారా జలవనరులతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమనే అంశంపై పలు సంస్థలు చిన్నారులకు అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందుకోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మట్టిగణపతుల తయారీపై పోటీలను ఆదివారం నిర్వహించాయి. అధిక సంఖ్యలో చిన్నారులు హాజరై వా రి ప్రతిభను ప్రదర్శించారు. హాజరైన అతిథులు పర్యావరణ పరిరక్షణ అంశాన్ని చిన్నారులకు వివరించారు. మట్టిగణపతి ప్రయోజనాన్ని విశదీకరించారు. లాఫింగ్ క్లబ్, షిర్డీ సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరం సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఈ పోటీలు శ్రీకాకుళం నగరంలో జరిగాయి. లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు 120 మంది హాజరయ్యారు. షిర్డీ సాయి ధ్యానమందిరం పోటీ ల్లో 108 మంది చిన్నారులు హాజరయ్యారు.

● ప్రతిమ.. పర్యావరణ హితమే