
కన్నబాబుకు పరామర్శ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. కాకినాడలోని ఆయన కుటుంబాన్ని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, రాష్ట్ర కళింగవైశ్య కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పోలినాటి వెలమ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్, ఎన్ని ధనుంజయ తదితరులు పరామర్శించారు.