
● కుబేర గణపతి
శ్రీకాకుళం కల్చరల్: గణపయ్య రూపం తయారీకి కాదేదీ అనర్హం అని నిరూపిస్తున్నారు నగరానికి చెందిన కళాకారుడు దాకోజు లాల్ ప్రసాద్. మూడేళ్లుగా ఏదో ఒక వినూత్న ఆలోచనతో పర్యావరణ హితమైన ప్రచారానికి వీలుగా సిద్ధిగణపయ్యను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది కుబేర గణపతిని తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి ఏటా అంపోలు గ్రామస్తుల కోరిక మేర కు ప్రత్యేకంగా గణపతులను తయారు చేసి వారికి అందజేస్తున్నారు. గత రెండేళ్లుగా ఐస్ క్రీమ్ పుల్లలతో ఒకసారి.. చాక్లెట్లతో ఒకసారి పార్వతీ తనయు డి విగ్రహాల్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఏమిటీ కుబేర గణపతి...
పర్యావరణ హితమైన వస్తువులతో ఈ ఏడాది కూడా గణపయ్యను రూపొందించేందుకు వివిధ ఆలోచనలు చేశాడు లాల్ ప్రసాద్. కరెన్సీతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని అంపోలు గ్రామకమిటీతో చర్చించారు. వారు సరే అనడంతో పది రోజుల వ్యవధిలో గణపయ్యను సిద్ధం చేశాడు. చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లు, థర్మాకోల్ షీట్లతో తన ఇంటివద్దే విగ్రహాన్ని రూపొందించారు. కాయిన్స్ కోసం బ్యాంకులను సంప్రదించి 20 వేల రూపాయల కాయిన్స్‌ను సిద్ధం చేసుకున్నాడు.
● కాయిన్స్.. కరెన్సీ నోట్లతో విగ్రహం
● 25 వేల నగదుతో పర్యావరణ గణపయ్య
● వరుసగా మూడో ఏడాది విభిన్న రూపం
కుబేర గణపతి