
ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడలు
అరసవల్లి: విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదుర్కొంటు న్న విద్యుత్ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ పోటీలు ఉపశమనం ఇస్తాయని తూర్పు ప్రాంత విద్యుత్ పంపి ణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. గురువారం స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు జరిగే పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీఎస్ సూర్య ప్రకాష్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, కార్యదర్శి మహంతి ప్రభాకరరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేళు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, జేఏఈ సనపల వెంకటరావు, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షు డు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిరోజు పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం జట్టు బాపట్లపై గెలుపొంది నెల్లూరు జట్టుతో జరిగిన పోరులో ఓటమి పాలైంది. కాగా, సర్కిల్ కార్యాల యం వద్ద సీఎండీ ఫృథ్వీతేజ్, డైరెక్టర్ సూర్యప్రకాష్ లు మొక్కలు నాటారు.