
ఇంట్లోనే తయారీ..
ఈ సీజన్‌లో ఇంట్లోనే బొమ్మలు తయారు చేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దీటుగా ఆకర్షణీయంగా మట్టి బొమ్మలు చేసేందుకు కుమ్మర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నా రు. కొందరు చదువుకున్న యువకులు కూడా ముందుకు వచ్చి వాటిని నేటి తరాన్ని ఆకర్షించేలా బొమ్మలు రూపొందిస్తున్నారు.
బొమ్మల తయారీకి షెడ్లు అవసరం ఉంది. విగ్రహాలు పెద్దఎత్తున చేయాల్సి ఉంటుంది. దీంతో అధిక సంఖ్యలో బొమ్మలు తయారు చేసి వర్షానికి తడవకుండా ఉండేందుకు ఇళ్లు తాత్కాలికంగా అద్దెలకు తీసుకుంటారు. మూడు నెలల ముందు నుంచి అద్దెకు తీసుకొని బొమ్మల తయారీ మొదలుపెడతారు. ఏడాదిలో వినా యక చవితికి, దసరా సందర్భంగా బొమ్మలు తయారు చేసి అమ్ముతుంటారు. వాటిని తయా రు చేసేందుకు ప్రత్యేక షెడ్లు వేయించాలని తయారీదారులు కోరుతున్నారు. అవి లేకపోవడంతో తాము ఉంటున్న ఇంట్లోనే ఉంచాల్సి వస్తోందని చెబుతున్నారు. రుణాలు సైతం మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు.