
సీపీఎస్ రద్దుకు ఉద్యమబాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఉద్యోగుల వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో జరగనున్న ఉద్యమానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడించిన దినం సెప్టెంబర్ 1న పురస్కరించుకొని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వరకు నలుపు వస్త్రాలు ధరించి భారీ నిరసన పాదయాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చల్ల సింహాచలం, నగర నాయకులు సూర్య, వంశీ, అనిల్ శ్రీనివాస్ పద్మ ప్రియా తదితరులు పాల్గొన్నారు.