
స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజిద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్లను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్‌ఓ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్టర్లు రూపొందించామన్నారు. కాలుష్య మండలి వారు క్యూఆర్ కోడ్‌ను తయారు చేశారని, కోడ్‌ని స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు అందించే ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అలానే 26వ తేదీన సూర్యమహల్ జంక్షన్ వద్ద స్టాల్‌ని ఏర్పాటు చేసి విగ్రహాలు పంపిణీ చేస్తామని తెలిపారు.