
సౌమ్యకు పరామర్శ
శ్రీకాకుళం: రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను శ్రీకాకుళం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి.మురళి, సీఐటీయూ జిల్లా కోశాధి కారి అల్లు సత్యనారాయణ, టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు సోమవారం సాయంత్రం పరామర్శించారు. బాధితురాలిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ను తక్షణమే ఆపాలని కోరారు. అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లోపింటి తేజేశ్వరరావు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నగర అధ్యక్షుడు కానుకూర్తి గోవిందలు కూడా ఆమెను పరామర్శించారు.