జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా

Aug 19 2025 6:37 AM | Updated on Aug 19 2025 6:37 AM

జోనల్

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరగాల్సిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు వాయిదా పడ్డాయి. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా పోటీలను అధికారులు వాయిదా వేసినట్టు డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని, ఎంపికై న క్రీడాకారులంతా విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.

డీపీటీఓగా అప్పలనారాయణ

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా సీహెచ్‌ అప్పలనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం అమ లు చేసిన శ్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సకాలంలో బస్సులు నడుపుతామని అన్నారు.

కురుడు పశువైద్యాధికారికి రాష్ట్రస్థాయి అవార్డు

టెక్కలి: రాష్ట్ర స్థాయిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ అవార్డుకు కోటబొ మ్మాళి మండలం కురుడు పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి లఖినేని కిరణ్‌కుమార్‌ ఎంపికయ్యారు. క్షేత్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్య సేవలు అందజేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 20న విజయవాడలో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జోన్‌–1 విభాగంలో కిరణ్‌కుమార్‌ అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు టెక్కలి డివిజన్‌ పశు వైద్య సిబ్బంది అభినందించారు.

‘దళారులను నమ్మి మోసపోవద్దు’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైందని, ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా హెచ్చరించారు. ఈ మేరకు సోమ వారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–ఐఐఐ, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, కాపీయిస్ట్‌, ఎగ్జామినర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశా మని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని వివరించారు. అభ్యర్థులు కేవలం మెరిట్‌ ఆధారంగానే ఎంపిక అవుతారని, డబ్బు లేదా సిఫారసుతో ఉద్యోగాలు సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కొంతమంది దళారులు తప్పుడు హా మీలు ఇస్తూ అభ్యర్థులను మోసం చేసే ప్ర యత్నం చేస్తున్నారని, అలాంటి మోసపూరిత చర్యలకు ఎవరైనా పాల్పడితే ఫిర్యాదు చేయా లని సూచించారు. ఈ పరీక్షలు జీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రాజాం, శ్రీ శివాని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ చిలకపాలెం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఎచ్చెర్ల, కోర్‌ టెక్నాలజీస్‌ గొట్టిపల్లి నరసన్నపేట కేంద్రాల్లో జరుగుతాయని తెలియజేశారు.

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా 1
1/2

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా 2
2/2

జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement