
శిక్షణతో ఖ్యాతిపొందూరు ఏఎఫ్‌కేకేకు చక్కటి అవకాశం వచ్చిం
ప్రాణహాని ఉందంటూ..
ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అడ్డగోలు రవాణాపై మొదటి నుంచి టీడీపీలో ఉంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై సనపల సురేష్ అనే కార్యకర్త పోరాడుతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాను అడ్డుకోవడమే కాకుండా సమాజానికి తెలియజేస్తున్నాడ ని గతంలో బూర్జ మండలం నారాయణపురం వంతెన వద్ద సనపల సురేష్‌పై కొంతమంది దాడి చేశారు. వీరంతా ఎమ్మెల్యే కూన రవి అనుచరులేనని సురేష్ అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత ఆమదాలవలస మండలం దూసిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించాడని సనపల సురేష్‌ను అక్కడి నుంచి శ్రీకాకుళం నగరంలోని బలగ వరకు వెంబడించి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులే తనను చంపడానికి దాడి చేశారని సురేష్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా పొందూ రు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్యను ఎమ్మె ల్యే రవికుమార్ వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ద్వారా తెలుసుకుని, ఆమెను పరామర్శించి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయన్ని కారులో వెంబడించడ మే కాకుండా మార్గమధ్యలో అడ్డుగా నిలిచారు. భయాందోళనకు గురైన సురేష్ నగరంలోని పలు వీధుల గుండా టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఎమ్మెల్యే రవికుమార్ నుంచి ప్రాణ హాని ఉందని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసు స్టేషన్‌లో రక్షణ కోరారు. వెంటనే ఆయన భార్య, తన ఇద్దరు పిల్లలు కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకుని రక్షణ కోసం ఇక్కడే ఉంటామని చెప్పి వేచి ఉన్నారు. దీంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు.