
‘ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం’
శ్రీకాకుళం క్రైమ్ : తండ్రి పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని, అందునా దళితురాలిని మానసికంగా వేధిస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ ప్రశ్నించారు. దీన్ని బట్టే చంద్రబాబు ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని చెప్పొచ్చన్నారు. సోమవా రం ఉదయం జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌లో నివాసముంటున్న పొందూరు కేజీబీబీ మహిళా ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. విషయం తెలిసి రిమ్స్‌కు చేరుకున్న చింతాడ రవి బాధితురాలు సౌమ్యను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మె ల్యే కూన రవికుమార్ ఒంటరి దళిత మహిళపై ఇంతటి అరాచకం చేస్తుంటే చంద్రబాబు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నా రు. దళితులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచీ చిన్న చూపేనని.. అసెంబ్లీ సాక్షిగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న చంద్రబాబు మాటలే అందుకు నిదర్శనమన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పోరాడుతుంటే ఎమ్మెల్యే ఇలా వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఐదురోజులుగా ఆమె కలెక్టర్‌కు, ఎస్పీకి విన్నవించుకుంటున్నా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికై నా తమ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ దళిత మహిళా ఉద్యోగినిపై ఎమ్మెల్యే కూన రవి కార్యకర్తలు అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారని, జిల్లా టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు పొన్నాడ రుషి మాట్లాడుతూ కూన రవి పాలన నీచాతినీచమని అన్నారు.