
పట్టపగలే తల పగలగొట్టి..
● పట్టుపురంలో మహిళపై దాడి ● బురఖా ధరించి చోరీకి ప్రయత్నించిన మరో మహిళ
మెళియాపుట్టి : పట్టపగలే ఓ మహిళ చోరీకి ప్రయత్నించడ మే కాకుండా.. మరో మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటన మెళియాపుట్టి మండ లం పట్టుపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టుపురం గ్రామానికి చెందిన అంబల కాంచన ఎప్పటిలాగే గురువారం మెళియాపుట్టిలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వచ్చి చూసేసరికే తలుపు చాటున బురఖా ధరించి ఉన్న గుర్తు తెలియని మహిళ ఇనుపరాడ్డుతో మహిళపై దాడికి పాల్పడింది. బాధితురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. గ్రామస్తులు వచ్చేసరికే గుర్తు తెలియని మహిళ ఒడిశా స్కూటీపై గారబంద వైపు వెళ్లిపోయింది. గ్రామస్తులు వెంబడించి నా ఆమె ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పాతపట్నం సీఐ వి.రామారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నగదు, విలువైన వస్తువులు ఏవైనా చోరీకి గురయ్యాయా?లేదా? అనేకోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, బాధితురాలి భర్త ఆర్టీసీలో డ్రైవర్ గా విధుల్లో ఉండగా.. ఇద్దరు కుమారులు ఉపాధి నిమి త్తం వలస వెళ్లారు.

పట్టపగలే తల పగలగొట్టి..