
● స్వేచ్ఛా కవనం
శ్రీకాకుళం కల్చరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక నిధి బృందం పర్యవేక్షణలో గాంధీ గుడి, స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి వనం రూపుదిద్దుకుంది. గాంధీజీ మందిరంతో పాటు 40 మంది స్వాతంత్య్ర యోధుల ప్రతిరూపాలను ప్రతిష్టించారు. ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఓ వైపు గాంధీ గుడిలో ధ్యానముద్రలో మహాత్ముడు, గుడి పైభాగాన భరతమాతతో పాటు 15 అడుగుల బాపూ జీ విగ్రహం, గుడి స్తంభాలపై మూడు మతాల చిహ్నాలు కనిపిస్తాయి. గుడి నలుమూలలా గాంధీజీ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు ఉన్నా యి. ఇక్కడ జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ప్రతిష్టించుకోవడం మరో విశేషం.