
ప్రభుత్వం మా కడుపు కొడుతోంది
కొత్తూరు:
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేయడంతో ఆటోలు, మాక్సీ పికప్ వాహనాల డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందని ఆటో యూనియన్ నాయకులు నీలయం నాయుడు, వాసు, ప్రసాద్, జమ్మయ్యలతో పాటు పలువురు అన్నారు. ఆటో డ్రైవర్ల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తూరులో గురువారం ఆందోళన నిర్వహించారు. ర్యాలీ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కె.బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు మాట్లాడుతూ వాహన మిత్ర పథకం అమలు చేశాకే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని కోరారు. ఆటోడ్రైవర్లకు నష్టదాయకమైన 21 జీఓను రద్దు చేయాలన్నారు.