
● కవర్‌పై కంచుమోగింది..
జిల్లాలోని సారవకోట మండలం బుడితిలోని కంచు, ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమలపై పోస్టల్ శాఖ దృష్టి సారించింది. 2022 ఏప్రిల్ 12న బుడితి వస్తువుల ప్రత్యేకతలపై కవర్‌ను విడుదల చేసింది. దీనికి ‘బుడితి బెల్ అండ్ బ్రాస్‌మెటల్ క్రాఫ్ట్’ అని నామకరణం చేసింది. కంచుగంట, ఇత్తడి, ఇతర లోహాలకు చెందిన దేవతా విగ్రహాలు, కొన్ని చిహ్నా లు, పాత్రల ఫొటోలను కవర్‌పై ముద్రించింది.
● నేతగాళ్ల సృజనను కవర్ చేస్తూ..
గాంధీజీ నుంచి నవతరం వరకు అందరూ ఆ‘ధరించి’న.. విశ్వఖ్యాతి గాంచిన పొందూరు ఖాదీపై 2019 డిసెంబర్ 5న ప్రత్యేక కవర్ విడుదల చేసింది. దానిపై రాట్నంతో పాటు గాంధీ మహాత్ముని ఫొటోను ప్రచురించారు. నిపుణులైన నేతగాళ్లు సృజించిన అద్భుతాల ఆనవాళ్లకు దక్కిన గొప్పగౌరవం ఈ కవర్. ‘ప్రైడ్ ఆఫ్ పొందూరు.. గాంధీజీస్ చెరఖా’ అని పోస్టల్ శాఖ నామకరణం చేసింది.

● కవర్‌పై కంచుమోగింది..