
● పరిశ్రమల స్థాపనకు సహకారం
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం ఇండస్ట్రియల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయని, వాటి ద్వారా ఉత్పత్తులు తయారు చేసి వ్యాపారం చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలో బీచ్ కారిడార్ ప్రారంభం కాబోతోందని, మూలపేట వద్ద పోర్టు దాదాపు పూర్తయ్యిందని, భోగాపురం ఎయిర్‌పోర్టుతో పరిశ్రమలు మరింతగా అభివృద్ధి కానున్నాయని వివరించారు. అనంతరం పలువురు ఇన్వెస్టర్లు స్థలం, విద్యుత్, కార్మికుల సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్‌వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.