
● వజ్రోత్సవ ఎగ్జిబిషన్
జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఎనిమిది నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రత్యేకతలతో కూడిన స్టాల్స్(ఎగ్జిబిషన్)ను బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రకాలం నాటి గుర్తులు, స్థానికంగా లభించే తినుబండారాలు, ఆ ప్రాంత స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులు, సాహిత్యకారులు, చారిత్రక భవనాలు, కళాఖండాలు, చేనేత ఉత్పత్తులు, కనువిందు చేశాయి. కాగా ఎగ్జిబిషన్ ప్రారంభం సమయానికి టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన స్టాల్ రెడీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్, డీఐసీ జనరల్ మేనేజర్ జి.ఎం.శ్రీధర్, ఇంటాక్ అదనపు కన్వీనర్ వి.జగన్నాథనాయుడు తదితరులు పాల్గొన్నారు.

● వజ్రోత్సవ ఎగ్జిబిషన్