
ఏడు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
కొత్తూరు: ఒడిశా రాష్ట్రం గుణుపూర్ నుంచి చైన్నెకి అక్రమంగా ఏడు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు తెలిపారు. కొత్తూ రు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం మధురైకు చెందిన మహలింగం సూర్య గుణుపూర్ నుంచి ఏడు కిలోల గంజాయిని బ్యాగ్‌లో పెట్టుకొని ఒడిశా రాష్ట్రం హడ్డుబంగి నుంచి కొత్తూరు మండలం మాతల వైపు కాలినడకన బయలుదేరాడు.
మాతల వద్ద ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. గంజాయిని స్వాధీనం చేసుకొని సూర్యపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో సీఐ చింతాడ ప్రసాదరావు పాల్గొన్నారు.