
అనాథల దత్తతపై అవగాహన
కళకళలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం ప్రయాణికులతో కళకళలాడింది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివా రం వరుసగా మూడు రోజులపాటు సెలవులు కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కాంప్లెక్స్ కిటకిటలాడుతూ కనిపించింది.
–శ్రీకాకుళం అర్బన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: అనాథ పిల్లలకు కుటుంబ సంరక్షణ కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దత్తతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత శాఖ మిషన్ వాత్సల్య పథకం కింద నిర్వహిస్తోంది. జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. తల్లిదండ్రులు లేని లేదా సంరక్షణ అవసరమైన పిల్లలకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కుటుంబ పెంపకం అందించే విధానమే పోస్టర్ కేర్ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివరించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉన్న దంపతులు లేదా ఒంటరి మహిళలు/పురుషులు ఈ పిల్లలకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించి, వారికి ప్రేమ, ఆప్యాయత, భద్రత ఇవ్వవచ్చని తెలిపారు.
దత్తత విధానం
పోస్టర్ కేర్‌లో కనీసం రెండేళ్ల పాటు పెంచిన పిల్లలను, నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం శాశ్వతంగా దత్తత తీసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. భారతీ య పౌరులైన దంపతులు లేదా ఒంటరి మహిళ/పురుషులు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి నేర చరిత్ర ఉండరాదని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా బాలల రక్షణ అధికారి 7901597211, రక్షణాధికారి (ఎన్.ఐ.సి.) 9849530982, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లను సంప్రదించాలని సూచించారు.

అనాథల దత్తతపై అవగాహన

అనాథల దత్తతపై అవగాహన