
ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయం
శ్రీకాకుళం: ఉపాధ్యాయ సంక్షేమంతోపాటు సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) మాజీ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరధర్ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా సహ అధ్యక్షురాలు బి.ధనలక్ష్మి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ 1974 ఆగస్టు 10న ప్రాంతాలకు కేడర్లకు యాజమాన్యలకు అతీతంగా ఉపాధ్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఉపాధ్యాయ నేత అమర జీవి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాల వారసత్వంగా స్థాపించినట్లు పేర్కొన్నారు. జిల్లా కోశాధికారి బి.రవి కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ పి.అప్పారావులు మాట్లాడుతూ విద్యారంగం సంస్కరణలతో ప్రభుత్వ విద్యారంగం నాశనమవుతోందని, చరిత్రను వక్రీకరించడం శాసీ్త్రయ భావనలను తొలగించడం సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిస్తుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి వసుందర దేవి, నాయకులు కోదండ రామయ్య, తంగి ఎర్రమ్మ, అరుణ, సౌజన్య, వైకుంఠరావు, తవిటి బాబు, రామారావు, వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు.