పీజీ...
బీఆర్‌ఏయూలో సీట్లు
కోర్సులు సీట్లు
రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్
ఎం.కాం 40 0
ఎంఏ ఎకనామిక్స్ 32 8
ఎంఏ ఇంగ్లిష్ 32 8
ఎంఎల్‌ఐఎస్‌సీ
(లైబ్రరీయన్,
ఇన్ఫర్మేషన్ సైన్సెస్ 32 8
ఎంఏ సోషల్ వర్క్ 32 8
ఎంఏ తెలుగు 32 8
ఎంఏ రూరల్ డవలప్‌మెంట్ 32 8
ఏఈడీ 32 8
ఎంజేఎంసీ 24 6
ఎంఏ ఫిలాసఫీ 0 20
ఎంఎస్సీ బయోటెక్నాలజీ 24 6
ఎంఎస్సీ మైక్రో బయాలజీ 16 4
ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 16 4
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 32 8
ఎంఎస్పీ అప్లయిడ్
మ్యాథమెటిక్స్ 16 4
ఎంఎస్సీ ఫిజిక్స్ 32 8
ఎంఎస్సీ జియోఫిజిక్స్ 12 3
ఎంఎస్సీ జియాలజీ 12 3
ఎచ్చెర్ల:
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలనే ఉద్దేశంతో పీజీ ప్రవేశ పరీక్షలు రాశారు. అయితే పీజీతో చక్కని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో రారష్ట్‌ర ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యంతో వీరంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జూన్ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. జూన్ 25 తేదీన ఫలితాలు కూడా వెల్లడించారు. అయితే తదుపరి చర్యలను చేపట్టలేదు. వెబ్ ఆప్సన్‌పై ఉన్నత విద్యా మండలి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఎప్పుడు ప్రవేశాలు కల్పిస్తారో తెలియక విద్యార్థులు ఆయోమయ పరిస్థితిలో ఉన్నారు.
అగమ్యగోచరం
ఏపీ పీజీసెట్ రాసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ పరీక్ష రాసి పీజీలో చేరతామనే ఉద్దేశంతో మరే పరీక్ష రాయని వీరంతా పీజీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ వెబ్ ఆప్సన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా మొదటి కౌన్సిలింగ్, రెండు, మూడో కౌన్సిలింగ్ అని చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దీనివలన విద్యార్థులతో పాటు విద్యాసంస్థలు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యా సంవత్సరం టైం టేబుల్ వేయడానికి విద్యాసంస్థలు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
వీసీలతో సమావేశాలేవీ..?
సాధారణంగా ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. వర్సిటీల్లో ఉన్న సమస్యలు, కోర్సులు, అవసరమైన నిధులపై చర్చించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒకసారి కూడా వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శి, చైర్మన్, విద్యాశాఖ మంత్రి, వీసీలతో ప్రతీ ఏడాది సమావేశం నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇటువంటి సమావేశాలను ఇప్పటివరకూ నిర్వహించలేదు. రాష్ట్రంలో 18 వర్సిటీలు ఉండగా వీరిలో ఎచ్చెర్ల మినహా 17 మంది వీసీలు రాజీనామాలు కూడా చేశారు. వీరిలో 9 మందిని కొత్తగా రిక్రూట్ చేయగా, మిగిలన చోట్ల ఇన్‌చార్జి వీసీలు కొనసాగుతున్నారు. వీసీలతో సమావేశం నిర్వహిస్తే, వారు సమస్యలు చెబితే నిధులు కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం సమావేశాలను నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు.
వేంకటేశ్వర వర్సిటీకి బాధ్యతలు
పీజీ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు తిరుపతి వేంకటేశ్వర వర్సిటీకి బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ఎచ్చెర్ల, రాజమండ్రి, ఏయూ కలిపి ఏయూకు ప్రవేశాల బాధ్యతను అప్పగించేవారు. తర్వాత ఏ వర్సిటీకి సంబంధించి ఆ వర్సిటీ ప్రవేశాలను కల్పించేది. కాగా ఇప్పుడు రాష్ట్ర మొత్తంగా ఒకే వర్సిటీ ప్రవేశాలను కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. అయితే వీరు స్పందించకపోవడంతో ఇంతవరకూ ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి స్టేట్‌మెంట్ విడుదల చేయలేదు.
మరిన్ని సెట్లలో ఆలస్యం
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీపీజీ సెట్‌తో పాటు లా సెట్, ఎడ్ సెట్ విద్యార్థులకు కూడా ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. వీరంతా ప్రవేశ పరీక్షలను రాసి ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో రెండు లా కళాశాలలు ఉన్నాయి. 15 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చేరేందుకు ఈ విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు. ఐసెట్, ఇంజినీరింగ్ సెట్ ప్రవేశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగతా సెట్ పరీక్షలన్నీ అలానే ఉన్నాయి.
ఫలితాలు విడుదలైనా.. ప్రవేశాలు జరగని వైనం
ఇప్పటికీ వెబ్ ఆప్షన్లు ఇవ్వని ప్రభుత్వం
దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు
వెబ్ ఆప్సన్స్ ఇంకా ఇవ్వలేదు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ ప్రవేశాలను నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంకా వెబ్ ఆప్సన్స్ ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద ఈ సమస్య ఉంది. ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉంది. ప్రవేశాలకు అనుగుణంగా విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారు చేయనున్నాము. ప్రవేశాల జాప్యం సమస్య లేకుండా విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రయత్నిస్తాం.
– పి.సుజాత, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ
వెరీ లేజీ..!