కొంచమైనా మిగలకొండ
టెక్కలి:
టెక్కలి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పంచాయతీ అనుమతులు సైతం తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కొండలను తవ్వేసి మైదానాలుగా మార్చేస్తున్నారు. అయితే దీనిపై చర్యలు తీసుకో వాల్సిన రెవెన్యూ, ఆయా పంచాయతీ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో, అడ్డగోలుగా అధిక మెట్రిక్ టన్నుల్లో కంకర తరలింపు చేసేస్తున్నారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 117/1 లో గల కొత్తపేట కొండలో ఇప్పటికే అడ్డగోలుగా కంకర తవ్వకాలు చేసేశారు. అలాగే జర్జంగి పంచాయతీ గుంజిలోవ సమీపంలో సర్వే నంబర్ 53లో సైతం కనీసం పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తరలించేస్తున్నారు. రెండు చోట్ల పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మైనింగ్ జిల్లా అధికారుల వద్ద ప్రస్తావించగా కొత్తపేట కొండపై తవ్వకాల విషయంలో విజిలెన్స్ అధికా రులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై స్థానికంగా రెవెన్యూ అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.
అన్యాయంగా కొండను తవ్వేశారు
కొత్తపేట గ్రామంలో ఇందిరమ్మ కాలనీలకు ఆను కుని ఉన్న కొండపై ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తవ్వకాలు చేశారు. ముందుగా అనుమతులు ఉన్నాయని భావించాం. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిసి అడ్డుకున్నాం.
– దుక్క రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌పీపీ మండల ఉపాధ్యక్షుడు, కొత్తపేట.
నాయకుల అండతోనే..
కొత్తపేట కొండతో పాటు గుంజిలోవ ప్రాంతంలో అక్రమంగా కంకర తవ్వకాలు చేసి తరలించేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ అండ ఉంది. – అన్నెపు రామారావు,
వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, జర్జంగి
కొత్తపేట కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
కొంచమైనా మిగలకొండ
కొంచమైనా మిగలకొండ


