పట్టుబట్టి.. పూర్తి చేసి..
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గకు చెందిన హరిముకుందపండా అనే వ్యక్తి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లగా అక్కడ దర్శన సమయంలో అవమానం జరిగిందని భావించి ఏకంగా రూ.పది కోట్లతో 12 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి పూను కున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆలయ నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎవరి నుంచి చందాలు వసూలు చేయకుండా, ఏ ఇంజినీర్ల సలహాలు, సూచనలు లేకుండా 83 ఏళ్ల వయసులో హరి ముకుందపండా స్వీయ పర్యవేక్షణలో కోవెల పనులు పూర్తి చేయడం విశేషం. మూడు రోజులు పాటు ప్రతిష్టామహోత్సవాలు, సహస్ర చండీ మహాయజ్ఞం జరగనున్నాయి.
కాశీబుగ్గలో నిర్మించిన వెంకన్న గుడి


