110 గ్రామాల్లో నాటుసారా ప్రభావం
టెక్కలి: జిల్లాలో 6 ఎకై ్సజ్ కార్యాలయాల పరిధిలో 110 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ పి.రామచంద్రరావు వెల్లడించారు. సోమవారం టెక్కలి ఎకై ్స జ్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి విలేకర్లతో మా ట్లాడారు. కొత్తూరు, హిరమండలం, నందిగాం, మెళియాపుట్టి, పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా సోంపేట, టెక్కలి ఎకై ్సజ్ స్టేషన్‌ల పరిధిలో గల మండలాల్లో 70 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉందన్నారు. జూన్ నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేకంగా నవోదయం కా ర్యక్రమంతో ఇప్పటికే 190 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏసీ పేర్కొన్నారు. గతంలో నాటుసారా అమ్మకాలు చేసిన 1224 మందిని గు ర్తించి వారిలో 724 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నాటు సారా తయారీ, విక్రయాలను మానేస్తే అలాంటి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే నాటుసారాకు అవసరమైన బెల్లం ఊటలను విక్రయించేవారిలో 58 మందిని గుర్తించామని వారిలో 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఏసీ రామచంద్రరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 838 బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకున్నామని, వాటిలో భాగంగా 1314 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలా సలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేసిన దుకాణంపై రూ.5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.
నాటు సారా అమ్మకాలు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు, ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలింపు, బెల్టు దుకాణాలు నిర్వహిస్తే తక్షణమే 14405 టోల్‌ఫ్రీ నంబరుకు గాని, 94409 02332 ఫోన్ నంబరుకు సమాచారం అందజేయాలని కోరారు. ఆయనతో పాటు టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్, సిబ్బంది ఉన్నారు.


