● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి లేనిచోట ఆపుతున్న భారీ లారీలు ● వీటిని ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్న ఇతర వాహనాలు ● చోద్యం చూస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి లేనిచోట ఆపుతున్న భారీ లారీలు ● వీటిని ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్న ఇతర వాహనాలు ● చోద్యం చూస్తున్న అధికారులు

Mar 28 2025 1:45 AM | Updated on Mar 28 2025 1:39 AM

శ్రీకాకుళం క్రైమ్‌ :

టీవల లావేరు మండలం బుడుమూరు హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో అదుపు తప్పిన కారు.. రోడ్డుపక్కనే ఆగివున్న స్కూటీ, లారీలను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. అధిక శాతం ఆగి ఉన్న వాహనాలు ముఖ్యంగా భారీ లారీలను ఢీకొట్టడం వల్లే చోటుచేసుకుంటున్నాయి. నిర్దేశిత పార్కింగ్‌ ప్రాంతం తప్ప మిగతా చోట్ల భారీ వాహనాలను ఆపవద్దనే నిబంధనలు ఉన్నా వాటిని డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్కింగ్‌ అనుమతి లేనిచోట..

హైవే రహదారులు, సర్వీసు రోడ్లు, గ్రామీణ రహదారులపై ఎక్కడపడితే అక్కడ భారీ వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాలు అదుపుతప్పి నేరుగా ఆగివున్న లారీలను, ఇతర భారీ వాహనాలను ఢీకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అనధికారికంగా ర్యాంపుల్లోని ఇసుకను తరలిస్తున్న లారీలైతే ఒకేసారి గుంపుగా రావడం.. జిల్లాలోని రోడ్లపై వారి కంపెనీ తాలుకా మోటార్‌ రిపేర్‌ పాయింట్ల వద్ద గంటలు సేపు ఆపేయడం, ఇసుకను తరలించేందుకు అనుకూల సమయంలో ఒకేసారి వెళ్లడం వల్ల మిగతా వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాక ట్రాఫిక్‌ అంతరాయమవుతోంది. లోపల ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం ఉన్నా బయట సర్వీసు రోడ్లపైనే ఆపేస్తున్నారు. ఇది జిల్లాలోని నదీ పరివాహక ఇసుక ర్యాంపులున్న అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది..

కలెక్టర్‌, ఎస్పీ మాటలు బేఖాతరు..

ఇటీవల జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌, ఎస్పీలు రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఆంక్షలను కఠినతరం చేయాలన్న ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్‌ చేసి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమో దు చేయాలని, ప్రమాదాలపై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ శాఖల వారీగా ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్‌లలో చోటుచేసుకుంటున్నాయని, జాగ్రత్తలు తీసుకోవడంలో హైవే అధికారులు విఫలమవుతున్నారని ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కేసులు నమోదు చేస్తాం

కలెక్టర్‌ ఉత్తర్వులు ఇప్పటికే అందాయి. హైవేపై అనుమ తి లేనిచోట్ల పెద్ద పెద్ద వాహనాలు ఆపితే కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తాం.

– ఎ.పార్థసారధి, డీటీసీ, శ్రీకాకుళం

● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి  లేనిచోట ఆపుతున్న భారీ ల1
1/1

● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి లేనిచోట ఆపుతున్న భారీ ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement