బత్తలపల్లి మండలంలోని గుమ్మల్లకుంట గ్రామానికి చెందిన మరిమడుగు ధర్మేంద్రరెడ్డి, రజిత దంపతులు ఎనిమిది ఎకరాల్లో కంది సాగు చేశారు. ఇప్పటి వరకు సాగు, ఎరువులు, పురుగుల మందుల కోసం రూ.1.60 లక్షలు ఖర్చు చేశారు. పంటకు తెగులు సోకడంతో వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల దుకా | - | Sakshi
Sakshi News home page

బత్తలపల్లి మండలంలోని గుమ్మల్లకుంట గ్రామానికి చెందిన మరిమడుగు ధర్మేంద్రరెడ్డి, రజిత దంపతులు ఎనిమిది ఎకరాల్లో కంది సాగు చేశారు. ఇప్పటి వరకు సాగు, ఎరువులు, పురుగుల మందుల కోసం రూ.1.60 లక్షలు ఖర్చు చేశారు. పంటకు తెగులు సోకడంతో వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల దుకా

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

బత్తలపల్లి: అప్పు చేసి సాగు చేసిన పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన రైతన్నకు చివరకు నిరాశే మిగులుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, తెగుళ్ల దాడి మరో వైపు కంది రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు లేక పంట సాగు ప్రారంభం నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు పూతదశలో విరుచుకుపడుతున్న లిల్లీబగ్‌ తెగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఆశలు.. అడియాసలు

ఐదు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట మరో నెలన్నర రోజుల్లో చేతికొస్తుందనుకున్న తరుణంలో తెగులు వ్యాపించడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసినట్లు అంచనా. బత్తలపల్లి మండలంలోనే దాదాపు 8 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. సీజన్‌ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్టోబర్‌ మాసంలో తుపాన్‌ ప్రభావంతో కురిసిన చిరుజల్లులకు పంట కొంతమేర ఏపుగా పెరగడంతో ఈ సారైనా మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశపడ్డారు. సాగు ఖర్చులు, ఎరువులు, పురుగుల మందుల కోసం అప్పు చేసి పెట్టుబడులు పెట్టారు. తీరా పంట పూతదశకు చేరుకున్న సమయంలో లిల్లీబగ్‌ తెగులు వ్యాపించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లుయింది.

ఇలా చేస్తే మేలు..

కంది పంటను ఆశించిన తెగులు లిల్లీబగ్‌ కాదని, వడ తెగులు అని ఏఓ ఓబిరెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాధి నియంత్రణకు సమగ్ర యాజమాన్యం పాటించాలన్నారు. మొక్కకు ఒకసారి తీవ్రమైన విల్ట్‌ సోకితే తిరిగి కోలుకోవడం కష్టమన్నారు. తెగులు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా తొలగించి పొలం బయట నాశనం చేయాలన్నారు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు. కార్బెండజం ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి తెగులు కనిపించన మొక్కల చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలని సూచించారు.

లిల్లీబగ్‌ తెగులు సోకిన కంది పంట

కంది పంటకు లిల్లీబగ్‌ తెగులు

ఆందోళనలో రైతులు

పెట్టుబడి కూడా దక్కదంటూ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement