సహజీవనం.. యువకుడి విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

సహజీవనం.. యువకుడి విషాదాంతం

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

● బెంగళూరులో హిందూపురంవాసి ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: సహ జీవనం చేస్తున్న మహిళ తనను వదిలేసి వెళ్లిపోయిందనే బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హనుమంతసాగర వద్ద జరిగింది. వివరాలు.. హిందూపురానికి చెందిన పవన్‌ కుమార్‌ (29) తరచూ బెంగళూరుకు వెళ్తూ ఉండేవాడు. అతనికి నాగమణి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. రెండేళ్ల క్రితం నాగమణి భర్త, పిల్లలను వదిలి పవన్‌తో వచ్చేసింది. ఇద్దరూ రాజానుకుంట చుట్టుపక్కల అద్దె ఇళ్లలో సహజీవనం చేసేవారు. వారం క్రితం ఇద్దరి నడుమ గొడవ జరిగింది. దీంతో నాగమణి పవన్‌కుమార్‌ను వదిలి హనుమంతసాగరలో బంధువుల ఇంటికి వెళ్లింది. పవన్‌ ఆమె చిరునామాను కనుక్కుని వెళ్లి ఎంత ప్రాధేయపడినా రానని చెప్పేసింది. విరక్తి చెందిన పవన్‌ అక్కడే రోడ్డుపై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీయడంతో జనం భీతావహులయ్యారు. కొందరు ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించాడు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

శిశు మరణాలు అరికట్టాలి

కదిరి టౌన్‌: నవజాత శిశు మరణాలు ఎట్టి పరిస్థితిల్లోనూ జరగకుండా చూడాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పైరోజా బేగం తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎన్జీఓ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించారు. కదిరి డివిజన్‌ పరిధిలోని వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పైరోజా బేగం మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి అవగాహన కల్పించాలన్నారు.

టీకాలు సరైన సమయంలో ఇవ్వాలన్నారు. సర్వేలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగాం అధికారి డాక్టర్‌ సునీల్‌, వైద్యులు చెన్నారెడ్డి, మహేశ్వర్‌ మారుతి, డీపీఎచ్‌ఎన్‌ఓ వీరమ్మ, ఆరు మండలాల సీహెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement