● ఉద్యోగాన్వేషణకు వచ్చి బలవన్మరణం..
హైదరాబాద్: ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన కె. సురేష్ (20) డిప్లొమా చదువుతున్నాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా గత నెల 1న హైదరాబాద్కు వచ్చి బ్రహ్మణవాడిలోని ఓ గదిలో తన కళాశాల స్నేహితురాలు అక్షయతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అక్షయ విధులకు వెళ్లి రాత్రి 7 గంటలకు తిరిగి గదికి వచ్చింది. ఎంతసేపు తలుపు కొట్టినా సురేష్ తీయకపోవడంతో ఫోన్ చేసినా స్పందించలేదు. మద్యం సేవించి నిద్రపోతున్నాడని భావించిన ఆమె, గది యజమానులకు విషయం తెలిపి పక్క గదిలో ఉన్న తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. మరుసటి రోజు మంగళవారం ఉదయం 8.45 గంటలకు తిరిగి వచ్చి తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా సురేష్ బట్టలు ఆరేసుకునే ప్లాస్టిక్ వైరుతో ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విషయాన్ని సురేష్ కుటుంబసభ్యులకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


