● నల్లమాడ మండలంలో అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
నల్లమాడ(ఓడీచెరువు): నల్లమాడ మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో 12కు 8 స్థానాలు గెలిచి జయకేతనం ఎగురవేయగా అదే ఊపుతో సర్పంచ్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా పరిస్థితులు ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలానికి చెందిన పలువురు అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. చారుపల్లి పంచాయతీకి చెందిన పోలం చంద్రారెడ్డి, కేశవరెడ్డి, పర్వత వీరనారప్ప, రామక్రిష్ణ, పీట్ల లక్ష్మీనారాయణ, కోటే వీరప్రకాష్, కుంచపు అమర, వల్లపు చంద్ర, పర్వత భాస్కర్, హరీష్, ఎర్ల శివ, బాబాఫక్రుద్ధీన్, నాగప్ప, కె.అమర్నాథ్ రెడ్డి, జి.మహేష్, వై.ప్రశాంత్, టి.సదాశివ, ఆదినారాయణ, పర్వతపు నారాయణ స్వామిలకు శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


