కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

సోమందేపల్లి (పరిగి): పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపునిచ్చి గౌరవిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ తెలిపారు. గురువారం ఆమె సోమందేపల్లిలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో రౌడీయిజం చేసిన అధికార పార్టీ అక్రమమార్గంలో పదవులు దక్కించుకుందని, నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదేనన్నారు. అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకూ కూటమి నాయకులు చేసిన హంగామా చూసి ఓటర్లు బాధపడ్డారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబును గద్దె దింపడానికి 2029 ఎన్నికల కోసం వేచి ఉన్నారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అయితే ప్రతి అడుగూ గుణపాఠంగా మలచుకుని విజయాలను సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలమేమిటో మరోసారి చూపుదామన్నారు. ముఖ్యమంత్రిగా ఆనాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులను వివరించి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గజేంద్ర, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెన్నంటే ఉండి నడిపిన

నాయకుడికి ప్రాధాన్యత

కార్యకర్తల సమావేశంలో

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement