జనవరి 10 నుంచి రెండోదశ జనగణన | - | Sakshi
Sakshi News home page

జనవరి 10 నుంచి రెండోదశ జనగణన

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

● పూర్తి వివరాలతో పక్కా సమాచారం

సేకరించాలని కలెక్టర్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: జిల్లాలో రెండో దశ జనగణన ప్రక్రియను జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఫీల్డ్‌ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దేశ ప్రగతికి, ప్రణాళికలు రూపొందించేందుకు జనగణన ఎంతో కీలకమన్నారు. అందువల్ల

ఎలాంటి లోపాల్లేకుండా జనగణనను పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఇందుకోసం మార్గదర్శకాలు, విధివిధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జనగణన రెండోదశ షెడ్యూల్‌ మేరకు స్వీయ గణన జనవరి 10 నుంచి జనవరి 24వ తేదీ వరకు ఉంటుందని, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు క్షేత్రస్థాయి జనగణన ఉంటుందన్నారు. పునఃపరిశీలన మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. జిల్లా జనగణన నోడల్‌ అధికారి సూర్యవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ, జనగణనలో కచ్చితమైన, వాస్తవ సమాచారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు.

‘డీవీఎంసీ’ నియామకానికి దరఖాస్తు చేసుకోండి

ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు, వివక్షతను అరికట్టేందుకు జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (డీవీఎంసీ)ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, అర్హత కలిగిన వారు కమిటీ సభ్యులుగా కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిటీలో 8 మంది సభ్యులుగా ఉంటారని, అందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు, ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారన్నారు. సమాజ సేవలో గుర్తింపు కలిగి, ఎన్జీఓలతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న ముగ్గురిని అనధికారిక సభ్యులుగా నియమిస్తామన్నారు. సభ్యుడిగా దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి తప్పనిసరిగా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఇతర కులాల నుంచి దరఖాస్తు చేసుకునే వారు సమాజ సేవలో పేరు ప్రఖ్యాతులు గడించి, ఎన్జీఓలతో కలిసి పనిచేసిన వారై ఉండాలన్నారు. వారిపై ఎలాంటి పోలీసు కేసు ఉండకూడదన్నారు. ఆసక్తి కలిగిన అర్హులు ఈనెల 23వ తేదీలోపు తమ దరఖాస్తులను పుట్టపర్తి వెస్ట్‌ గేటుకు సమీపంలోని దీన జనోద్ధరణ భవన సముదాయంలోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాలు, సంక్షేమ, సాధికారిత కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

‘పది’ పరీక్ష ఫీజు

25లోపు చెల్లించాలి

పుట్టపర్తి టౌన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు ఇప్పటికే ఫెయిల్‌ అయి మళ్లీ పరీక్ష రాయదలచిన విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు ఫీజు చెల్లించాలని డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను యూడైస్‌ ఫ్లస్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసిwww.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. 25వ తేదీ వరకూ ఎలాంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన పనిలేదని, డిసెంబర్‌ 2వ తేదీ వరకు రూ.50, డిసెంబర్‌ 9వ తేదీ వరకు రూ.200, డిసెంబర్‌ 15వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు కంటె తక్కువ సబ్జెక్టులున్న వారు రూ.110, వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు అదనంగా రూ 60, వయోపరిమితి సడలింపు కోసం రూ.300 చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement