తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

ప్రశాంతి నిలయం: మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ ఎన్నికలకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. తొలి దశలో ధర్మవరం డివిజన్‌లోని 7 మండలాల పరిధిలోని 144 గ్రామ పంచాయతీలకు, 1,156 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. తొలిదశలో బత్తలపల్లి, సీకేపల్లి, ధర్మవరం, కనగానపల్లి, ముదిగుబ్బ, రామగిరి, తాడిమర్రి మండలాల పరిధిలోని పంచాయతీకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈనెల 13న (శుక్రవారం) నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 21న ఉపసంహరణ, 26న పోలింగ్‌, లెక్కింపు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement