తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

విద్యార్థుల జీవితంలో చదువు ఎంతో కీలకమైన దశ. ఇలాంటి సమయంలో కొందరు పాఠశాల, కళాశాల విద్యార్థులు మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల సమయంలోనూ గేమ్స్‌ ఆడాలనే ఆలోచనతో చదువును పక్కన పెడుతున్నారు. ఫలితంగా చదువులో వెనుకబడడం, ఏకాగ్రత తగ్గడం, నిద్ర వేళలు మారిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. యువత గుంపులుగా చేరి ఒకే చోట కూర్చొని ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకుంటున్నారు. గంటల తరబడి అక్కడే కూర్చొని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలై ఎక్కువ సమయం గడిపేస్తున్నారు.

మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్‌లో గేమ్స్‌ ఆడటం ప్రారంభించిన యువత క్రమంగా వాటికి అలవాటు పడుతున్నారు. ఒక గేమ్‌ పూర్తయితే మరో గేమ్‌ అందులో ఓడిపోతే తిరిగి గెలవాలనే పట్టుదలతో అలానే గేమ్‌లో మునిగిపోతున్నారు. ఇలా నిమిషాలతో మొదలైన ఆట గంటల తరబడి కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల స్నేహితులు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఫోన్‌పైనే దృష్ట్టి కేంద్రీకరిస్తున్నారు. కొందరు ఉదయం నుంచి రాత్రి వరకు సమయం దొరికినప్పుడల్లా గేమ్స్‌ ఆడుతూ ఇతర పనులను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి.

కొన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌ డబ్బులు పెట్టి ఆడే బెట్టింగ్‌ తరహా గేమ్స్‌ను యువతను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో కొందరు డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఆటల్లో గెలుపు కోసం గంటల తరబడి సమయాన్ని వెచ్చించడం , ఓటమిని తట్టుకోలేక మళ్లీ మళ్లీ గేమ్స్‌ ఆడటం వంటి అలవాట్లు పెరుగుతున్నాయి. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభించి ఉండడంతో నష్టాలను తిరిగి సంపాదించాలనే ఆశతో మరిన్ని డబ్బులు ఖర్చు చేసి పోగొట్టుకుంటున్నారు.

మొబైళ్లలో పిల్లలు ఎం చూస్తున్నారు? ఎలాంటి గేమ్స్‌ ఆడుతున్నారు.. ఎంత సేపు ఫోన్‌ వినియోగిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు పరువు కోసం పాకులాడకుండా పిల్లల భవిష్యత్త్‌ చూసుకోవాలి. చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో అని భయపడుతూ పిల్లలను అలానే వదిలేస్తున్నారు.

ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు

ఆన్‌లైన్‌ గేమ్స్‌.. ఆర్థిక ప్రమాదాలు

కాలక్షేపం కోసం మొదలెట్టి..

విద్యార్థులు మొబైల్‌ ‘మత్తు’కు బానిసవుతున్నారు..

మొబైళ్ల వినియోగం విద్యార్థులు, యువతతోపాటు అన్నివర్గాల్లోనూ పెరిగిపోయింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, అను చిత వెబ్‌సైట్లు, ప్రమాదకర యాప్‌లవైపు ఆకర్షితులవుతున్నారు. గేమ్స్‌కు అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. రోజూ సుమారు 8 నుంచి 10 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. మొబైల్‌కు బానిసవుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. – యెండ్లూరి ప్రభాకర్‌,

మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement