వైఎస్సార్‌సీపీ నాయకులకు బెయిల్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులకు బెయిల్‌ మంజూరు

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

మడకశిర: నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులకు స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. అమరాపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో భాగంగా కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని గత ఆదివారం మడకశిరలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు ధర్నా చేశారు. స్థానిక పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని, నిబంధనలు ఉల్లంఘించారని వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఈకేసులో ఏడుగురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మడకశిరకు చెందిన దళిత నాయకుడు హనుమంతు, అమరాపురం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కృష్ణమూర్తి, రాజేష్‌, నాగరాజు, దానేగౌడ్‌, మంజునాథ్‌, మల్లికార్జునను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.వీరికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయవాదులు వైసీ గోవర్ధన్‌రెడ్డి, అశ్వత్థనారాయణ పిటిషన్‌ వేశారు. ఈబెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి అశోక్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ నాయకులకు బెయిల్‌ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా నిరసన తెలిపిన దాదాపు 50 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సమా చారం. మిగిలిన వైఎస్సార్‌సీపీ నాయకులను కూడా అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

గడువులోపు

రీసర్వే పూర్తి చేయాలి

● అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌

మౌర్య భరద్వాజ్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: జిల్లాలో చేపట్టి భూముల రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన రీసర్వే పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మౌర్య భరద్వాజ్‌ క్షేత్రస్థాయి సర్వే పనుల పురోగతిపై సమీక్షించి సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్ణీత గడువులోపు రీసర్వే పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే విభాగం అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ నెలలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్న గ్రామాల వివరాలను ఈనెల 20వ తేదీలోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆర్డీఓలు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు మండల తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement